Skip to main content

Posts

Featured

పరిచయం

  అనగనగా పశుపతినాథపురం అనే ఒక కుగ్రామం. ఆ గ్రామానికి ప్రవేశిస్తుందండగా గ్రామదేవత అంకాలమ్మ గుడి ఒకవైపు, ఆంజనేయ స్వామి గుడి మరోవైపు, గ్రామం లోపల రామాలయం, శివాలయం ఉన్నాయి. ఆ గుళ్ళు ఉండడం వల్ల ఆ గ్రామానికి ఎలాంటి ఇబ్బందులు రావు అని ప్రజల నమ్మకం. వారి నమ్మకమో లేక దేవదేవిల మహిమ వల్లనో తెలియదు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సంవత్సరాలు గడిపారు. ఆ గ్రామం నదీ తీరాన ఉండడంతో అందరు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వ్యవసాయస్తులతో పాటు ఆ గ్రామంలో కుమ్మరి, వడ్రంగి, కమ్మరి, వస్త్రముల నేత ఇలా వివిధ రకాల నైపుణ్యం కలిగినవారు కూడా ఉండేవారు. ఏ నైపుణ్యం మీద ఎవరికి ఆసక్తి ఉంది అని తెలుసుకుని ఆడ మగ తేడా లేకుండా ఆ నైపుణ్యంలో రాణించడానికి అందరికి శిక్షణ ఇవ్వడానికి ఒక పాఠశాలను కూడా ఏర్పరుచుకున్నారు. దొంగల బెడద లేకుండా గ్రామం మధ్యలో ఒక ధనాగారం, ధాన్యాగారం ఏర్పరుచుకుని వాటికి ఐదుగురు శక్తిశాలులను రాత్రులు కాపలాగా నియమించారు. ప్రజలందరూ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా కొన్ని నిభందనలు ఏర్పరుచుకుని వాటిని ఎప్పటికప్పుడు అమలు చేసే భాద్యత వెంకటపతిరాజు, భూపతిరాజు, మల్లన్న, సత్యమయ్య, సుబ్బన్న అనే యువక...

Latest Posts

Chapter1: అరుణిమ హెల్లాస్ చేరుకుంటుందా?

Chapter2: విక్రమార్కుడు, ప్రతాపుడు, ధనుంజయుడు నిజంగా పిల్లలేనా?